వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి

Apr 8 2026 8:02 AM | Updated on Apr 8 2026 8:02 AM

మొగుళ్లపల్లి: అసంక్రమణ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ ఎల్‌.విజయలక్ష్మి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా డాక్టర్‌ నవత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయలక్ష్మి హాజరై మాట్లాడారు. బీపీ, షుగర్‌, క్యానర్స్‌ లాంటి వ్యాధులను అరికట్టేందుకు ఆశ కార్యకర్తల పాత్ర కీలకం అన్నారు. అనంతరం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చాట్ల విజయ రవి, ఎంపీడీఓ సురేందర్‌, ఆస్పత్రి సిబ్బంది, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

పరీక్ష కేంద్రం తనిఖీ..

మండలకేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని విజయలక్ష్మి పరిశీలించారు. మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి పథకంలో రోడ్డు ఫార్మేషన్‌ పనిని పరిశీలించారు.

అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement