మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను రైతులను సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు భూములు అవసరమైన గ్రామాల్లో గ్రామసభల నిర్వహణకు ముందస్తుగా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఎస్డీసీ రమేష్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, అధికారులు పాల్గొన్నారు.
అలసత్వం ప్రదర్శించొద్దు..
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు. ప్రజల నుంచి 80 దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


