హోటళ్లలో ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

హోటళ్లలో ఆకస్మిక తనిఖీ

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

హోటళ్లలో ఆకస్మిక తనిఖీ

భూపాలపల్లి అర్బన్‌: ఆహార భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లలో సోమవారం జిల్లా ఆహరభద్రత అధికారి వరుణ్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వంటగది, ఆహార పదార్థాల నిల్వ విధానం, గదిలోని పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. హోటల్‌ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు చేశారు. హోటళ్లలో ఆహార పదార్థాలను పరిశుభ్రంగా నిల్వ చేయడం, శుభ్రంగా ఉండేలా చూసుకోవడం వంటి అంశాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిల్వచేసిన ఆహర పదార్థాలను ఉపయోగించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement