భూపాలపల్లి అర్బన్: సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరై ప్రభుత్వ పాఠశాలల విద్యను బలహీనపర్చే మాటలు మాట్లాడటం, చిన్నచూపు చూడటం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామిలు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు దాదాపు సమానంగా ఉన్నాయని అసర్, నాస్ వంటి సర్వేలు స్పష్టం చేశాయన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్ర భుత్వ పాఠశాలలో లోపాలున్నాయని సీఎం వ్యాఖ్యానించడం ప్రభుత్వ విద్యను బలహీనపర్చే చర్యగా భావించాల్సి వస్తుందన్నారు.
వెంకటాపురం(ఎం): కేన్ మొక్కలను సంరక్షించాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ప్రభుత్వాన్ని కోరారు. మండల పరిధిలోని పాలంపేట గ్రా మ శివారు, రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఉన్న కేన్ ప్రాంతాన్ని ఆయన ఆది వారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 51 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నాయని తెలిపారు. కేన్ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించినప్పటికీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ఏడాది జనవరి 12న కొంతమంది సుమారు రెండు ఎకరాల ప్రాంతంలో కేన్ ప్రాంతాన్ని దగ్ధం చేశారని తెలిపారు. మూడు నెలల అనంతరం అవి చిగురిస్తున్నాయని వెల్ల డించారు. కేన్ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణకే తలమానికంగా ఉన్న కేన్ రక్షిత ప్రాంతం చుట్టూ ఇప్పటికై నా అటవీ, రెవెన్యూశాఖ అధికారులు జీపీఎస్ ద్వారా సర్వే నిర్వహించాలన్నారు. అలాగే ట్రెంచ్ కొట్టి చైన్ లింక్ ఫెన్సింగ్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసి కేన్ ప్రాంతాన్ని భావితరాలకు అప్పగించాలని సతీష్ కోరారు.
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకుని తిల తైలాభిషేకం పూజాలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ అర్చకులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌ఎస్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన ఇంటర్ క్లబ్ టెన్నిస్ పోటీలు ఆదివారం ముగిశాయి. టి.సాత్విక్–రడం శ్రీనివాస్ ప్రథమ స్థానం, ఎరగ్రట్టు స్వామి–ఎం.శివరాజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు, టెన్నిస్ అసోసియేషన్ హనుమకొండ అధ్యక్షుడు నల్ల సురేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, టెన్నిస్ వంటి క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పోటీలు నిర్వహించడానికి సహకరించిన హనుమకొండ డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ టె న్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎరగ్రట్టుస్వామి, టెన్నిస్ అసోసియేషన్ సభ్యుడు బాబురెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.


