జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు కృషి

భూపాలపల్లి రూరల్‌: డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర ఆధ్వర్యంలో నిర్వహించిన జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్‌ రాహుల్‌ శర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడు తూ జగ్జీవన్‌ రామ్‌ నిరుపేద కుటుంబంలో జన్మించి కేంద్రమంత్రిగా, ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు. కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కృషి, పట్టుదలతో సాధన చేస్తే విజయం సాధ్యమవుతుందని నిరూపించిన గొప్ప వ్యక్తి జగ్జీవన్‌ రామ్‌ అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్రా కొముర య్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు, బీసీ సంఘం నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అణగారిన వర్గాల సంక్షేమానికి..

సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించిన మహనీయుడు జగ్జీవన్‌ రామ్‌ ఎస్సీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ నరేష్‌ కుమార్‌, ఆర్‌ఐ అడ్మిన్‌ రత్నం, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement