సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలి

Apr 6 2026 7:48 AM | Updated on Apr 6 2026 7:48 AM

సీనియర్‌ సిటిజన్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేయాలి

మల్హర్‌(కాటారం): కాటారం డివిజన్‌ కేంద్రంలో సీనియర్‌ సిటిజన్స్‌ డే కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సీనియర్‌ సిటిజన్స్‌ రాష్ట్ర నాయకుడు, డీటీఎఫ్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విద్యా పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం.రఘుశంకర్‌రెడ్డి కోరారు. మండలంలోని కాటారం స్థానిక ఆదర్శ విద్యాలయంలొ ఆదివారం కరుణాకర్‌ ఆధ్వర్యంలో కాటారం రెవెన్యూ డివిజన్‌ స్థాయి పెన్షనర్స్‌, సీనియర్‌ సిటిజన్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ కాటారం డివిజన్‌ స్థాయిలో సుమారు 450 మంది పెన్షనర్స్‌, వేలాదిగా సీనియర్‌ సిటిజన్స్‌ ఉన్నారని చెప్పారు. సీనియర్‌ సిటిజన్స్‌ రిక్రియేషన్‌, డేకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలం సంఘం ప్రతినిధులు అంకమ్మ అంకన్న, శంకరయ్య, వెంకటి, ఎం.రవి శంకర్‌రెడ్డి, మధుసూదన్‌రావు, దామోదర్‌రెడ్డి, డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement