
నీతి ఆయోగ్‌లో జిల్లాకు రెండో స్థానం
భూపాలపల్లి: నీతి ఆయోగ్‌లో జిల్లా రెండో స్థానం దక్కించుకుంది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆస్పిరేషనల్ జిల్లాలు, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన జిల్లాలు, మండలాలను ఎంపిక చేసి శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో అవార్డులను ప్రదానం చేశారు. సంపూర్ణత అభియాన్ విభాగంలో మెరుగైన ఫలితాలు సాధించి జిల్లా రెండవ స్థానం దక్కించుకోగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా కలెక్టర్ రాహుల్ శర్మ అవార్డు అందుకున్నారు.
స్ట్రాంగ్ రూం ఏర్పాటుకు ప్రతిపాదనలు
కాటారం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కాటారం మండల కేంద్రంలో ఈవీఎంలు భద్రపర్చడం కోసం స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. శనివారం సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోని గదులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. పరిసరాలు, గదుల సంఖ్య, సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యుత్, ఇతరత్రా సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ బాబు, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్ ఉన్నారు.
సూపరింటెండెంట్‌గా ఉమేశ్వరి
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా డి.ఉమేశ్వరి నియమితులయ్యారు. భద్రాది కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉమేశ్వరికి చీఫ్ నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి లభించింది. దీంతో బదిలీపై భూపాలపల్లి వచ్చి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి నర్సింగ్ సిబ్బంది ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్స్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
మున్సిపల్ సిబ్బంది కమిటీ ఎన్నిక
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది, కార్మికుల కమిటీని శనివారం ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షుడిగా సంకటి సదయ్య, ఉపాధ్యక్షుడిగా కల్లెపల్లి తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా నగవత్ రాజేందర్ (బద్రి), కోశాధికారిగా రాపర్తి జంపయ్య, గౌరవ అధ్యక్షులుగా బండారి బాబు, నన్నపు ప్రకాశ్, ముఖ్య సలహాదారులుగా ఓరుగంటి రాజేందర్, జనగాని వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులుగా అల్లూరి మంజుల, ఏకు సునీత, అంతడుగుల సతీష్‌లకు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘అదనపు రుసుము
వసూలు చేస్తే చర్యలు’
కాటారం: మీ సేవ ద్వారా రుసుము అదనంగా వసూలు చేస్తే చర్యలు తప్పవని ఈడీఎం శ్రీకాంత్ హెచ్చరించారు. మండలకేంద్రంలోని మీ సేవ కేంద్రాలను శనివారం ఈడీఎం తనిఖీ చేశారు. మీ సేవల్లో అందుబాటులో ఉన్న సేవలు, సౌకర్యాలపై ఆరాతీశారు. రికార్డులను పరిశీలించారు. పౌర సేవలకు సంబంధించిన ధరల పట్టికను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలను నిరంతరంగా అందించాలని సూచించారు. మీ సేవకు వచ్చే ప్రజల పట్ల మర్యాదగా నడుచుకోవాలని వారి సమయం వృథా చేయవద్దని ఈడీఎం పేర్కొన్నారు.

నీతి ఆయోగ్‌లో జిల్లాకు రెండో స్థానం

నీతి ఆయోగ్‌లో జిల్లాకు రెండో స్థానం