
ఏకాగ్రతతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి
భూపాలపల్లి అర్బన్: ఏకాగ్రతతో చదివి ఉత్తమఫలితాలు సాధించాలని శాసన మండల ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలు, గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు, అమరవీరుల స్థూపానికి పూలమాల వేపి నివాళులర్పించారు. కేటీకే 1, 5వ గనుల్లో పర్యటించి కార్మికులతో మాట్లాడారు. పదవి విరమణ పొందుతున్న కార్మికులను సన్మానించారు. అనంతరం వేశాలపల్లి గ్రామంలో పలువురు బాధితులను పరామర్శించి, జంగేడు కేజీబీవీని తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. ప్రహరీ పనులు వేగవంతం చేయాలని ఏఈని ఆదేశించారు.
శాసన మండల ప్రతిపక్ష నేత సిరికొండ