
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆకుదారివాడ, మహబూబ్‌పల్లి, కుందూరుపల్లి, పూల్లూరిరామయ్యపల్లి, కాకతీయకాలనీలకు చెందిన 94మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, హౌసింగ్ పీడీ లోకిలాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.