
గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
కాటారం: మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేయడానికి కృషిచేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని గ్రంథాలయాన్ని బుధవారం కోట రాజబాబు సందర్శించారు. గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, వార్తా పత్రికలు, సౌకర్యాలపై ఆరాతీసి రికార్డులను పరిశీలించారు. గ్రంథాలయాల్లో పాఠకుల కోసం పూర్తి సౌకర్యాలు కల్పించి నిరుద్యోగులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. లైబ్రరీ ఉద్యోగులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఇష్టానుసారంగా హాజరవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాటారం లైబ్రేరియన్ రజిత పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కోట రాజబాబు