
నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి
భూపాలపల్లి అర్బన్: సింగరేణి అధికారులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సింగరేణి ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫార్మర్ డైరెక్టర్ మోహన్‌రెడ్డి సూచించారు. ఏరియాలోని జీఎం కార్యాలయంలో బుధవారం ఏరియా అధికారులకు నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్మికులు, సూపర్‌వైజర్లతో ఎలా మాట్లాడాలి, వారితో ఎలా ప్రవర్తించాలి, నాయకత్వ లక్షణాలకు ఎలా పెంపొందించుకోవాలనే అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, అధికారులు మారుతి, రవీందర్, డాక్టర్ పద్మజ, రాజేశ్వర్, పోషమల్లు, రజిని, బాలరాజు పాల్గొన్నారు.