
సమస్యలు పరిష్కరించాలి
చిట్యాల: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.తిరుపతి కోరారు. మంగళవారం డీటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్ ప్రభాకర్, నాయకులు వీరేశం, సుధర్శన్, వెంకట్రాం నర్సయ్య పాల్గొన్నారు.
మినీ ల్యాబ్ పరిశీలన
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఉన్నత పాఠశాలలో సింగరేణి సంస్థ నేషనల్ టీమ్ ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్‌ను బెంగళూరు అధికారులు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధి కారులు నాగదేవ్, శ్రీకాంత్‌లు సందర్శించి వి ద్యార్థులతో మాట్లాడి ల్యాబ్ ఉపయోగాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్ర ధానోపాధ్యాయురాలు ఝాన్సీరాణి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సుజాత, గీత పాల్గొన్నారు.
బస్సునుంచి జారి
మహిళకు తీవ్రగాయాలు
భూపాలపల్లి అర్బన్: ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంజూర్‌నగర్‌లోని వెయ్యి క్వార్టర్స్ కాలనీకి చెందిన కంగూరి కవిత పని నిమిత్తం హనుమకొండకు వెళ్లి పరకాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో భూపాలపల్లికి వస్తుంది. ఈ క్రమంలో మంజూర్‌నగర్‌లో దిగేందుకు ప్రయత్నిస్తుండగా బస్సులో నుంచి జారీపడింది. దీంతో కవితకు తల, నడుము భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయి. ఘటనా స్థలం నుంచి 108 ద్వారా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌కు తరలించారు.
నాయీ బ్రాహ్మణ సేవా
సంఘం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్
మొగుళ్లపల్లి: నాయీ బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా భూపాలపల్లికి చెందిన కురుమిళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన నడిగోటి రాము ను ఎన్నుకున్నారు. శ్రీనివాస్, రామును మండలాల అధ్యక్ష, కార్యదర్శులు అభినందించారు.
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌ను కలిసిన డీఎంహెచ్‌ఓ
ములుగు రూరల్ : మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణలతను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాలరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆమెను శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ ఎడ్యుకేషన్, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కీటక జనిత నియంత్రణ జిల్లా అధికారి చంద్రకాంత్ ఉన్నారు.
ఆగస్టు 5న
సీపీఐ జిల్లా మహాసభ
ములుగు రూరల్: ఆగస్టు 5న జిల్లాకేంద్రంలో సీపీఐ జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ తెలిపారు. మంగళవారం మల్లంపల్లిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మహాసభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల ఐలయ్య, శ్యామ్ సుందర్, రవి, రాజు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి