కాటారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు హెచ్చరించారు. కాటారం మండలం రేగులగూడెం డీసీఎంఎస్ ఎరువుల విక్రయ కేంద్రం, అరవింద కృప ఫర్టిలైజర్‌ను బాబురావు, మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల స్టాక్ నిల్వలు, స్టాక్ రిజిస్టర్ పరిశీలించారు. విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడంతో పాటు ధరల, స్టాక్ పట్టికలను ఏర్పాటు చేయాలని దుకాణాల ని ర్వాహకులను ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందుల దుకాణాలను నిర్వహించాలని తెలిపారు. ప్రతీ కొనుగోలుపై రైతులకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని, రైతులకు అవసరం లేకుండా లింకు ఎరువులను అంటగట్టవద్దని సూచించారు. డీఏఓ వెంట మండల వ్యవసాయ అధికారి పూర్ణిమ, ఏఈఓ ఉన్నారు.
నానో యూరియా వాడకంతో ప్రయోజనం
రైతులు పంట సాగులో నానో యూరియా, నానో డీఏపీ వినియోగించడం వలన బహుళ ప్రయోజనాలు కలుగుతాయని ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు అన్నారు. కాటారం మండలం రేగులగూడెం రైతువేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా నానో యూరియా, డీఏపీ వినియోగంపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ పంటలో పోషకాల లభ్యత, పోషకాలను పెంచడంలో నానో యూరియా, డీఏపీ ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మహదేవపూర్ ఏడీఏ శ్రీపాల్, ఎంఏఓ పూర్ణిమ, ఏఈఓ అస్మా, రైతులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు