
హేమాచలుడి హుండీ ఆదాయం రూ.9లక్షలు
మంగపేట : మండలంలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీల ద్వారా రూ.9.18లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ సహాయ పరకాల డివిజన్ పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు కానుకలను లెక్కించారు. ఆరు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని భక్తులు హుండీల్లో స్వామివారికి సమర్పించారు. అర్చకులు శేఖర్‌శర్మ, పరిచారిక ఈశ్వర్‌చంద్, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, సిబ్బంది శేషు, లక్ష్మీనారాయణ, అజయ్, నవీన్, గణేష్ పాల్గొన్నారు.