
వ్యాపారాలే లేవనడం హాస్యాస్పదం
భూపాలపల్లి: మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వ్యాపారాలే లేవనడం హాస్యాస్పదమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, విదేశాల్లో వెంకటరమణారెడ్డికి ఉన్న వ్యాపారాల చిట్టా త్వరలోనే మీడియా ముందు విప్పుతానని అన్నారు. అక్రమ కేసులు మోపడం బీఆర్‌ఎస్ పార్టీకి మాత్రమే అలవాటని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు సతీష్, శ్రీకాంత్, కురిమిళ్ల శ్రీనివాస్‌లపై అక్రమ కేసులు మోపి జైలుకు పంపింది మీరు కాదా అని ప్రశ్నించారు. హనుమకొండలో జీఎంఆర్ కట్టడాల కోసం మానేరు ఇసుకను మోరంచపల్లి బ్రిడ్జి వద్ద డంప్ చేసి తరలించింది మీరు కాదా అన్నారు. వెంకటరమణారెడ్డి పదేళ్లు భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉండి చేసిందేమీ లేదని, 18 నెలల్లో తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నాడన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక బచ్చా అని, కనీస అవగాహన లేక సీఎం రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పిప్పాల రాజేందర్, అప్పం కిషన్, క్యాతరాజు సాంబమూర్తి, ముంజాల రవీందర్, మధు, తోట సంతోష్ పాల్గొన్నారు.
విదేశాల్లో ఉన్న వ్యాపారాల చిట్టా విప్పుతా
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు