
నాణ్యమైన వైద్యసేవలు అందించాలి
కాటారం: మారుమూల గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్ సూచించారు. మహాముత్తారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సబ్ కలెక్టర్ తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని పేర్కొన్నారు. వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ హెచ్చరించారు. సబ్‌కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఉన్నారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్