
ఆదివాసీ మారణహోమాన్ని నిలిపివేయాలి
కాటారం: ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వం పాల్పడుతున్న మారణ హోమాన్ని నిలిపివేసి చర్చలు జరపాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఆదివాసీలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కాటారం మండలకేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ 15 నెలల కాలంలో 600 మంది అమాయక ప్రజలను బూటకపు ఎన్‌కౌంటర్ పేరిట చంపారని విమర్శించారు. ఈ సమావేశంలో వేదిక కోఆర్డినేటర్ గడ్డం లక్ష్మణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ నాగ భూషణం, పీడీఎం రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి, సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్, మార్వాడి సుదర్శన్, సారంగపాణి, తగరం శంకర్‌లాల్, ఐతే బాపు, పార్వతక్క పాల్గొన్నారు.