ఉపాధి కూలీలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కూలీలకు భరోసా

Jul 28 2025 8:15 AM | Updated on Jul 28 2025 8:15 AM

ఉపాధి

ఉపాధి కూలీలకు భరోసా

కాటారం: ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగిన కూలీలకు ప్రధాన మంత్రి సురక్ష పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కూలీలతో కొంత ప్రీమియం సొమ్ము చెల్లింపజేసి వారికి బీమా కల్పించేలా ప్రొత్సహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కూలీల్లో బీమా ఉన్నవారు ఎవరు.. లేనివారు ఎవరనే సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. బీమాకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి మండల ఉపాధిహామీ అధికారులకు ఆదేశాలు వచ్చాయి.

71ఏళ్లలోపు వారు అర్హులు..

జిల్లాలో మొత్తం 71,120 యాక్టివ్‌ జాబ్‌ కార్డులు ఉండగా.. ఇందులో 1,32,120 మంది కూలీలు పని చేస్తున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. సురక్ష బీమా యోజన కోసం 18 నుంచి 71 ఏళ్లలోపు వారు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన కూలీలు జాతీయ బ్యాంకుల్లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాతా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచ్‌లో ఖాతా నుంచి ఏటా రూ.20 బీమాకు జమచేయాలని అంగీకారపత్రాన్ని కూలీలు ఇవ్వాల్సి ఉంటుంది. పేరు నమోదు చేసుకున్న వారు ఎవరైన ప్రమాదవశాత్తు మరణించినా, పూర్తి వైకల్యం కలిగినా ప్రధాన మంత్రి సురక్ష యోజన పథకం ద్వారా రూ.2లక్షల పరిహారం అందే అవకాశం ఉంటుంది. పాక్షికంగా వైకల్యం కలిగిన వారికి రూ.లక్ష పరిహారం అందుతుంది.

సమస్యగా మారిన చెల్లింపు..

ఉపాధి కూలీలకు బీమా చెల్లింపు సమస్యగా మారింది. బీమా నమోదు కోసం లబ్ధిదారులు ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు బ్యాంకులకు దూరంగా ఉండటంతో నిరక్షరాస్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది కూలీలు తమ వేతనాలను సీఎస్సీ కేంద్రాల ద్వారా తీసుకుంటారు. కానీ బీమా పొందాలంటే వేతనదారుడి ఇంటి పేరు, తండ్రి, భర్త, వయస్సు, బ్యాంకు ఖాతా, ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేయాలి. వేతనదారుల నుంచి ఉపాధి సిబ్బంది అనుమతి పత్రం సేకరించి బ్యాంకుల్లో అందజేయాలి. ప్రతి రోజు పథకం కింద నమోదైన వివరాలు జిల్లా ఉపాధి కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వందశాతం కూలీలకు బీమా సౌకర్యం కల్పించేలా ఉపాధి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ప్రతీ కూలీకి వర్తింపు..

ఉపాధిహామీ పనులకు వచ్చే ప్రతీ కూలీకి బీమా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో ఎవరెవరికి బీమా లేదని బ్యాంకుల వద్ద సేకరించి వారికి బీమా కల్పించేలా సిబ్బందికి ఆదేశాలు జారీచేశాం. బీమా ఆవశ్యకతపై కూలీలకు అవగాహన కల్పిస్తున్నాం.

– బాలకృష్ణ, డీఆర్‌డీఓ

జిల్లా ఉపాధిహామీ వివరాలు..

12

241

ఉపాధి హామీ బ్లాకులు

గ్రామపంచాయతీలు

జాబ్‌ కార్డుల సంఖ్య

కూలీల సంఖ్య

యాక్టివ్‌ జాబ్‌ కార్డులు

యాక్టివ్‌ కూలీల సంఖ్య

ప్రధాన మంత్రి సురక్ష యోజన బీమా పథకం అమలు

బీమా లేని వారిని గుర్తించే పనిలో అధికారులు

వందశాతం అమలు చేసేందుకు చర్యలు

ఉపాధి కూలీలకు భరోసా1
1/7

ఉపాధి కూలీలకు భరోసా

ఉపాధి కూలీలకు భరోసా2
2/7

ఉపాధి కూలీలకు భరోసా

ఉపాధి కూలీలకు భరోసా3
3/7

ఉపాధి కూలీలకు భరోసా

ఉపాధి కూలీలకు భరోసా4
4/7

ఉపాధి కూలీలకు భరోసా

ఉపాధి కూలీలకు భరోసా5
5/7

ఉపాధి కూలీలకు భరోసా

ఉపాధి కూలీలకు భరోసా6
6/7

ఉపాధి కూలీలకు భరోసా

ఉపాధి కూలీలకు భరోసా7
7/7

ఉపాధి కూలీలకు భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement