వనదేవతలకు
మొక్కులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో సండే సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. సూర్యభగవానుడి అలంకరణలో రామలింగేశ్వరస్వామి పర్యాటకులకు దర్శనమిచ్చాడు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.
రామప్పలో సండే సందడి
రామప్పలో సండే సందడి
రామప్పలో సండే సందడి