
శ్రావణ శోభ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో శ్రావణశోభ నెలకొంది. శ్రావణమాసం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు చేశారు. ముందుగా త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీమహాసరస్వతి అమ్మవార్ల ఆలయాల్లో పూజలు చేశారు. మహిళలు ఉసిరిచెట్టు వద్ద దీపారాధనలు, ప్రదక్షిణలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది.

శ్రావణ శోభ