
లాభాల వాటా ప్రకటించాలి
భూపాలపల్లి అర్బన్: గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో సాధించిన లాభాలను వెల్లడించి కార్మికుల వాటా ప్రకటించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఏరియాలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లాభాల వాటా గతంలో 33 శాతం ఇచ్చారని, ఈ సారి 35 శాతం ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు. త్వరలోనే లాభాల వాటా ప్రకటన వస్తుందన్నారు. కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా యాజమాన్యం కమిటీ వేసిందని త్వరలోనే రిపోర్టు రాగానే కార్మికుల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహించి కార్మికుల పక్షాన పోరాడే ఏకై క సంఘం ఏఐటీయూసీ మాత్రమేనని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లయ్య, రామచందర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, చంద్రమౌళిలు పాల్గోన్నారు.
ఏఐటీయూసీ అధ్యక్ష, కార్యదర్శులు వాసిరెడ్డి
సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్