
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
రేగొండ: విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. బుధవారం మండలంలోని మహాత్మజ్యోతిబాపులే పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బంది హాజరు నమోదు రిజిస్టర్‌ను పరిశీలించారు. గ్రామాలలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ శ్రీదేవి, డీసీఓ స్వప్న, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల వైద్యాధికారిని హిమబిందు, పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ