
మావోయిస్టుల కదలికలపై నిఘా
కాటారం: మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూ వారికి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. మహాముత్తారం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు, నమోదైన కేసులు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను ఎస్సై మహేందర్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్సై, సిబ్బందితో సమావేశం నిర్వహించి పెండింగ్ కేసులను ఛేదించడం, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన పద్ధతులపై డీఎస్పీ వివరించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు గ్రామాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రొబేషనరీ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
కాటారం డీఎస్పీ సూర్యనారాయణ