
మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మర్చిపోయిన బ్యాగ్, రూ.20 వేల నగదును తిరిగి అందించి కండక్టర్, డ్రైవర్లు మానవత్వం చాటుకున్నా రు. భూపాలపల్లి ఆర్టీసీ బస్సులు మంగళవా రం ఉదయం హైదరాబాద్‌కు వెళ్తుండగా స్టేష న్‌ఘన్‌పూర్‌లో బస్సు ఎక్కిన ప్రయాణికుడు ఉప్పల్ క్రాస్‌లో తన బ్యాగ్, అందులో రూ.20 వేల నగదును వదిలి దిగి వెళ్లినట్లు తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి తిరిగి వస్తు న్న క్రమంలో ఉప్పల్ క్రాస్ వద్ద కంట్రోలర్ సమక్షంలో ప్రయాణికుడికి బ్యాగ్, నగదును కండక్టర్ అనిత, డ్రైవర్ వేణు అందించారు.
ట్రాన్స్‌ఫార్మర్ టెస్టింగ్ విజయవంతం
భూపాలపల్లి అర్బన్: మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలో నూతనంగా సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ టెస్టింగ్ విజయవంతమైనట్లు భూపాలపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మంగళవారం 8.0 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ టెస్టింగ్‌ను విజయవంతం చేశా రు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. మండలంలోని వివిధ గ్రామాల్లో ఓవర్‌లోడ్ సమస్యను తగ్గించడానికి, వినియోగదారుల కు నాణ్యమైన, నిరంతరం విద్యుత్‌ను అందించేందుకు నూతన సబ్‌స్టేషన్లను నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీఈ, ఏడీఈ, ఏఈ, ఓఅండ్‌ఎం, ఎంఆర్‌టీ విభాగాల బృందాలు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది