
ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు
భూపాలపల్లి: రాష్ట్రంలో రైతులు ఎరువుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చెప్పులు క్యూ లైన్లలో ఉంచే పరిస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు భూపాలపల్లికి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ నెల 27వ తేదీన మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కొడారి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మొగుళ్లపల్లి, జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడతారని అన్నారు. ఈ సమావేశానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతు చేయకపోవడంతో కొన్ని వేల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోతుందన్నారు. మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్ధన్, నాయకులు రఘుపతిరావు, సెగ్గం సిద్ధు, నూనె రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 27న భూపాలపల్లికి
కేటీఆర్ రాక
మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి