
మరో పోలీస్ సర్కిల్
భూపాలపల్లి: జిల్లాలో మరో కొత్త పోలీస్ సర్కిల్ ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతం మహదేవపూర్, కాటారం, చిట్యాల సర్కిళ్లు ఉండగా కొత్తగా గణపురం సర్కిల్ ఏర్పాటు కానుంది. చిట్యాల సర్కిల్ పరిధిలో గణపురం, రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. కాగా ఈ సర్కిల్ పరిధి పెద్దగా ఉన్నందున, విభజించి గణపురం, రేగొండ, కొత్తగా ప్రారంభం కానున్న గోరికొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లను కలిపి గణపురం సర్కిల్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో త్వరలోనే జిల్లాలో నాలుగవ సర్కిల్ ఏర్పాటు కానుంది.
● చిట్యాలను విభజించి
గణపురం సర్కిల్ ఏర్పాటు