
ఆ తర్వాతే సర్పంచ్, వార్డు సభ్యులు
పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షిప్రతినిధి, వరంగల్ : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? బుధవారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించడం వెనుక మతలబు ఇదేనా? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిందా?.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. అధికారవర్గాలు కూడా స్థానిక సంస్థల నోటిఫికేషన్ త్వరలోనే రావచ్చని చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు భావిస్తున్నారు.
● ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సర్కారు సమాయత్తం
● ఉమ్మడి వరంగల్‌లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ,
పంచాయతీ స్థానాల వెల్లడి
● వచ్చే నెల మొదటి, రెండో వారాల్లో నోటిఫికేషన్?
● అధికారులకు ఎన్నికల సంఘం
సంకేతాలు.. సిద్ధమవుతున్న పార్టీలు
ఉమ్మడి వరంగల్‌లో జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు