
డ్రగ్స్‌కు బానిసలుగా మారొద్దు
ఏటూరునాగారం: విద్యార్థులు డ్రగ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో బుధవారం డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్‌పై డిగ్రీ కళాశాల, గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ యువత చెడుదారుల వైపు వెళ్లకుండా ప్రణాళికతో చదివి లక్ష్యం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజం, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు, ప్రేమ వలలో పడి విలువైన జీవితాలను బలి చేసుకోవద్దని తెలిపారు. సమస్యలు, ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీసులను కలిసి సమస్యను వివరించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ క్రైమ్స్‌కు గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజ్‌కుమార్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ