
20 గుంటల విస్తీర్ణం.. 30 రకాల మొక్కలు●
గణపురం: ఆయన ఓ ప్రకృతి ప్రేమికుడు ప్రకృతిని ఆస్వాధించాలనే తపనతో తన ఇంటి ఆవరణలోని 20 గుంటల్లో పండ్ల మొక్కలతోపాటు, వాణిజ్య మొక్కలు నాటుతున్నారు.. మండలకేంద్రానికి చెందిన తాళ్లపెల్లి సదానందం. 25 సంవత్సరాలుగా ప్రైవేట్ పాఠశాల నిర్వహించిన ఆయన మొదటి నుంచే వన ప్రేమికుడు. ఇంటి ఆవరణలో సుమారు 30 రకాల పండ్ల మొక్కలతోపాటు, వాణిజ్య మొక్కలను పెంచుతూ వాటిని కన్నబిడ్డల్లా సాకుతున్నారు. రాజమండ్రి, కడెం ప్రాంతాల నుంచి తెప్పించిన మొక్కలు ఎదిగి సంవత్సరమంతా పండ్లను ఇస్తున్నాయని ఆనందంగా చెబుతున్నాడు.. సదానందం. అంతేగాకుండా వాణిజ్య మొక్కలైన ఎర్ర చందనం, టేకు, జామాయిల్ మొక్కలను సైతం పెంచుతున్నాడు. మొక్కలు, చెట్లుతో నిండిన ఆవరణలోకి నిత్యం అనేక రకాల పక్షులు వస్తుండడంతో వాటికోసం సైతం ప్రత్యేకంగా ఒక గుడిసెను నిర్మించిన సదానందం సాక్షితో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ప్రకృతి ప్రేమించాలని, మొక్కలు నాటడడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించవచ్చని తెలిపారు.