
చెట్లంటే ప్రాణం..
టేకుమట్ల: మండలంలోని రాఘవరెడ్డిపేట గ్రామానికి చెందిన బొద్దుల కొండల్‌రెడ్డి 76 సంవత్సరాల వయస్సులో సైతం మొక్కలను నాటుతూ చెట్లను ప్రాణంగా ప్రేమిస్తూ ఇంటి పరిసరాలు మొత్తం చెట్లతో నింపేశాడు. ఇంటి ఆవరణలో 19 గుంటల స్థలంలో మామిడి, జామ, నిమ్మ, ఉసిరి, అల్లనేరేడు, అరటి, వేప, టేకు, సీతాఫలం, ఎలక్కాయ, తదితర మొక్కలను చాలాకాలంగా పెంచుతూ వన ప్రేమికుడిగా గుర్తింపు పొందాడు. పండ్లను విక్రయించేందుకు ప్రాధాన్యం ఇవ్వకుండా అడిగిన వారందరికీ పంచుతూ మన్ననలను పొందుతున్నాడు. చెట్లంటే తనకు ఎంతో ఇష్టమని, ప్రతీ చెట్టును ప్రాణంగా చూసుకుంటానని చెబుతున్నాడు.. వన ప్రేమికుడు కొండల్‌రెడ్డి.