విస్తృత ప్రచారం నిర్వహించాలి
భూపాలపల్లి: రాజీవ్ యువ వికాసం పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించి ఎక్కువమంది దరఖాస్తు చేసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రజా భవన్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌కు ఐడీఓసీ నుంచి అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పథకంపై మండల, మున్సిపల్ స్థాయిలో టామ్ టామ్ ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ నరేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జీఎం సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్


