రాష్ట్రంలో నిరంకుశ పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో నిరంకుశ పాలన

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశ పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. స్థానిక బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు చేసిన హామీలను విస్మరిస్తూ తుగ్లక్‌ పాలన సాగిస్తున్నారని, కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ప్రజల గుండెల్లో నుంచి కేసీఆర్‌ను తీసివేయడం రేవంత్‌రెడ్డి తరం కాదన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌ పార్టీ కండువాతో గ్రామాల్లో తిరుగుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, ఆయన అనుచరులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యంతో రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్‌ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement