భక్తిశ్రద్ధలతో వాసవిమాత జయంతి | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో వాసవిమాత జయంతి

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

జనగామ: రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవం ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా జరిగింది. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమా నికి కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారి చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. వేడుకల్లో ఇన్‌చార్జ్‌ యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కోదండరాములు, సీపీఓ కోటా నాయక్‌, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్‌ కుమార్‌, చాంబర్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, మాజీ అధ్యక్షుడు మహంకాళి హరిశ్చంద్రగుప్త, రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధి పూజ్జూరి జయహరిగుప్త, బెజుగం భిక్షపతి, అరుగుల శ్రీనివాస్‌, బిజ్జాల నవీన్‌, గట్టు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

డీసీపీ కార్యాలయంలో..

శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని డీసీపీ కార్యాలయంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్‌ పూజలు చేశారు. ఆర్యవైశ్యులు సమాజంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, పేద కుటుంబాలకు అండగా నిలిచే గురుతర బాధ్యత కలిగిన వారన్నారు. ఆర్యవైశ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కానిస్టేబుళ్లు కె.సంపత్‌, జి.ప్రసాద్‌, తాటికొండ రవి, డ్రైవర్‌ శ్రీను, గన్‌మన్‌ శ్రీనివాస్‌, ఏఆర్‌ గాడ్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement