ఈ నంబర్లు అత్యవసరం | - | Sakshi
Sakshi News home page

ఈ నంబర్లు అత్యవసరం

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

జనగామ: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సేవలను వేగంగా పొందేందుకు మిషన్‌ వాత్సాల్య పథకంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం హెల్ప్‌లైన్‌ నంబర్ల జాబితా విడుదల చేసింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, సైబర్‌ మోసాలు, దత్తత ప్రక్రియ, డ్రగ్స్‌ వ్యసనం వంటి అనేక అత్యవసర సందర్భాల్లో వెంటనే సంబంధిత విభాగాలకు సమాచారం అందజేసి సహాయం పొందేలా ఇవి రూపొందించారు. ప్రజలు ఈ హెల్ప్‌లైన్‌ నంబర్లను గుర్తుంచుకొని, అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని డీడబ్ల్యూఓ కోదండరాములు తెలిపారు. జిల్లా మహిళా, పిల్లల, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

హెల్ప్‌లైన్‌ నంబర్ల జాబితా విడుదల

సైబర్‌ మోసాలు, డ్రగ్స్‌, వేధింపులపై ఫిర్యాదులు

1098–14567 వరకు అత్యవసర సమయంలో వినియోగం

పిల్లలు, దివ్యాంగులు, మహిళలు, వృద్ధుల కోసం..

అత్యవసర సమయాల్లో హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబర్లు:

పిల్లల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌–1098

ఈఆర్‌ఎస్‌ అత్యవసర సహాయ నెంబర్‌–112

మహిళల కోసం–181 హెల్ప్‌లైన్‌

పిల్లల దత్తత కోసం–1800–11–1311

డ్రగ్స్‌ నియంత్రణ –1908

మహిళల భద్రత కోసం షీ టీమ్స్‌– 8712685142

సైబర్‌ మోసాలపై ఫిర్యాదు–1930

పోలీసు హెల్ప్‌లైన్‌–100

అంగన్‌వాడీ సేవల కోసం–155209

దివ్యాంగుల హెల్ప్‌లైన్‌–1800–572–8980

వృద్ధుల కోసం హెల్ప్‌లైన్‌–14567

Advertisement
 
Advertisement
Advertisement