డీజిల్‌ నోస్టాక్‌ | - | Sakshi
Sakshi News home page

డీజిల్‌ నోస్టాక్‌

Apr 27 2026 7:48 AM | Updated on Apr 27 2026 7:48 AM

వరికోతల వేళ ఇబ్బందులు

కొడకండ్ల: వరికోతల వేళ డీజిల్‌ కొరతతో వాహనాల యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి న పరిస్థితి నెలకొంది. మండలకేంద్ర పరిధిలోని నాలుగు బంకుల్లో నాలుగు రోజులుగా డీజిల్‌ స్టాక్‌ లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వరికోతల సమయంలో డీజిల్‌ స్టాక్‌ లేక వరికోత యంత్రాలు, ట్రాక్టర్‌ యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా వరికోతలు ఆలస్యమవుతుండడంతో రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బంక్‌ల నిర్వాహకులు డబ్బులు చెల్లించినా కూడా వారానికి ఒకసారి కూడా అయిల్‌ కంపెనీల నుంచి డీజిల్‌ సరఫరా కాకపోవడంతో నిర్వాహకులు నోస్టాక్‌ బోర్డులు పెట్టుకొవాల్సిన పరిస్థితి నెలకొంది. వరికోత యంత్రాల, ట్రాక్టర్‌ల యాజమానులు సీజన్‌ కావడంతో దూరప్రాంతాల్లో డీజిల్‌ స్టాక్‌ ఉన్న బంక్‌ల వద్దకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆయిల్‌ కంపెనీలు స్పందించిన వరికోతల సీజన్‌లో డీజిల్‌ సరఫరా చేసి ఇబ్బందులు తీర్చాలని వాహనాల యాజమానులు, రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement