జనగామ: సీసీఐ కేంద్రాల్లో తేమ శాతం వంటి కారణాలతో పత్తి రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, మార్కెటింగ్, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యంతో పత్తి కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నాణ్యత పేరిట తిరస్కరించకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, డీసీపీ రాజామహేంద్రనాయక్, జిల్లా మార్కెటింగ్ అధికారి నరేంద్ర, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికాసోని, జిల్లా ఫైర్ అధికారి రేమాండ్, విద్యుత్ శాఖ అధికారి, సీసీఐ అధికారి నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శులు, పాల్గొన్నారు.
యువత అన్ని రంగాల్లో రాణించాలి
జనగామ రూరల్: యువత అన్ని రంగాల్లో రాణించాలని, నైపుణ్యాల ప్రదర్శనకు యువజనోత్సవాలు గొప్ప వేదిక అని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నా రు. జిల్లా యువజన ఉత్సవాలను స్థానిక జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ ప్రారంభించారు. ఈ పోటీల్లో జానపద గేయాలు, నృత్యాలు, కథారచన, ఉపన్యాసం, కవిత్వం, సైన్స్ మేళ నిర్వహించారు. జిల్లా యువజన క్రీడల అధికారి కోదండరాములు, జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ పాల్గొన్నారు.
సమీక్షలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా


