అద్దె అవస్థలు.. | - | Sakshi
Sakshi News home page

అద్దె అవస్థలు..

Nov 4 2025 7:18 AM | Updated on Nov 4 2025 7:18 AM

అద్దె

అద్దె అవస్థలు..

వసతులు అంతంతే.. అద్దె భవనాల్లో కొనసాగింపు.. పోస్టుల భర్తీ ఇంకెప్పుడు..

జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల

వివరాలు:

అంగన్‌వాడీలకు
జిల్లావ్యాప్తంగా 180 కేంద్రాలకు సొంత భవనాలు లేవు

మరిగడిలో అద్దె భవనంలో

కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

జనగామ రూరల్‌: పూర్వ ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పలు సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. 3 నుంచి 6 సంవత్సరాల వయస్సు గల వారికి పౌష్టికాహారంతో పాటు చదువుపై ఆసక్తిని పెంచేలా ఆటపాటలతో విద్య వైపు అడుగులు వేసేలా అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిల్లో చేరే విద్యార్థుల సంఖ్య సైతం పెరుగుతోంది. అయితే వారికి అవసరమైన పౌష్టికాహారం అందిస్తున్నా..మౌలిక వసతుల కల్పనపై మాత్రం శ్రద్ధ వహించడం లేదనే ఆరోపణలున్నాయి.

జిల్లావ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో 217 సొంత భవనాలు ఉన్నప్పటికీ, అవసరమైన మౌలిక వసతులు లేవు. ముఖ్యంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యలో అనేక మార్పులు వచ్చాయి. విద్యార్థులు మొబైల్‌ ద్వారా అనేక విషయాలు తెలుసుకుని నూతన ఆవిష్కరణలకు మొగ్గుచూపుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ చిన్నారులకు డిజిటల్‌ బోధన ద్వారా వారిని ఆకర్షించాల్సిన అవసరముంది. ఆటపాటలతో విద్య చేర్పించేందుకు ఆటల సామగ్రి, ఆలోచనలు పెంచే బొమ్మలు వంటివి సమకూర్చాల్సి ఉంది.

అంగన్‌వాడీ పిల్లలను ఆకర్షించేందుకు అనేక రకాలైన వసతులతో పాటు సొంత భవనాలు కూడా అవసరం. జిల్లావ్యాప్తంగా 180వరకు ఆద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పిల్లలకు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుండగా.. అద్దెల రూపంలో వేల రూపాయల ప్రజాధనం వృథా అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల పెంకుటిళ్లలో కొసాగిస్తుండడంతో విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత జిల్లా అధికారులు సొంత భవనాలపై దృష్టి సారించి అన్ని రకాల వసతులు కల్పించి సెంటర్లను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో కేటాయించిన ప్రీస్కూల్‌ ద్వారా విద్యాబోధన చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలకు సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా మారింది.

జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ పోస్టులను ప్రభుత్వం భ ర్తీ చేయకపోవడంతో అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణ కష్టంగా మారుతోంది. జిల్లాలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌, కొడకండ, జనగామ క్లస్టర్‌లో ఉన్న 46 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.

పౌష్టికాహారం అందుతున్నా..

మౌలిక వసతులే సమస్య

చిన్నారులను ఆకట్టుకొనేలా

ఆటపాటల బోధన కరువు

టీచర్‌, ఆయా పోస్టుల భర్తీపై అశ్రద్ధ

ప్రభుత్వం దృష్టిసారిస్తేనే పూర్వ

ప్రాథమిక విద్య బలోపేతం

ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు : 656

మినీ అంగన్‌వాడీకేంద్రాలు : 39

సొంత భవనాలు : 217

అద్దె భవనాలు : 180

ఫ్రీ అద్దె భవనాలు : 298

మొత్తం అంగన్‌వాడీ కేంద్రాలు : 695

అద్దె అవస్థలు..1
1/1

అద్దె అవస్థలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement