రైతులు అధైర్యపడొద్దు
పాలకుర్తి టౌన్/ కొడకండ్ల: రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో మోంథా తుపానుతో దెబ్బతిన్న పంటలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నష్టపోయిన రైతులను ఆదుకునేలా క్షేత్రస్థాయిలో ఆధి కారులు పనిచేయాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను రైతు భరోసా యాప్ ద్వారా నమోదు చేయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికాసోని, ఏడీఏ పరుశురాంనాయక్, ఎంపీడీవో వేదవతి, ఎంపీవో రవీందర్, కొడకండ్ల తహసీల్దార్ చంద్రమోహన్, వ్యవసాయాధికారి విజయ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆర్థిక విద్యతోనే..
ఆర్థిక విద్యతోనే సమాజం ఆర్థికంగా బలపడుతుందని కలెక్టర్ షేక్ రిజ్వాన్ షేక్ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీసోమేశ్వర ఆలయ కల్యాణ మండపంలో వాలంటరీ ఇంటిగ్రేడ్ డెవలప్‌మెంట్ సొసైటీ అ నంతపురం ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కేంద్రా ల సీఎఫ్‌ఎల్ కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కలెక్ట ర్ పాల్గొని మాట్లాడుతూ.. బ్యాంకింగ్ సేవాలు అందరికీ చేరేలా మార్గనిర్దేశం చేయాలని సూచించారు.
పక్కాగా పంట నష్టం నమోదు చేస్తాం..
జిల్లాలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా విస్తృత పర్యటన

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
