‘సిండి’కోటపై నిఘా
జనగామ: జిల్లాలో మద్యం వ్యాపారంలో సిండికేట్ వ్యవహారంపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. 2025–27 రెండేళ్ల కాలానికిగానూ కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుండగా, వైన్స్‌షాపుల కొనుగోలు ప్రక్రియలో పెద్ద మొత్తంలో చేతులు మారుతున్నట్లు సమాచారం మేరకు నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. శ్రీసిండికోట రహస్యంశ్రీ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథథనాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. జిల్లాలో సిండికేట్ కార్యకలాపాలపై నిఘా వర్గాలు నిశితంగా దృష్టి సారించా యి. ఎక్కడెక్కడ ఒప్పందాలు జరుగుతున్నాయి..?ఎవరెవరికీ ఆర్థిక ప్రయోజనం కలుగుతోంది? అనే అంశాలపై ప్రత్యేక బృందాలు పరిశీలన ప్రారంభించాయి. లైసెనన్స్‌దారులు పారదర్శకంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ పెరుగుతుండగా, నిఘా వర్గాలు సైతం పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలిసింది. నిఘా వర్గాలు కదిలిన తరుణంలో.. ప్రైవేటుగా కొనుగోళ్లకు సంబంధించి ఎక్కడా చిక్కకుండా రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం.
మద్యం దుకాణాల లైసెన్సుల
కొనుగోలుపై ఆరా
‘సిండి’కోటపై నిఘా


