రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం
జనగామ రూరల్: రాజీమార్గంతోనే కేసులు పరిష్కారమవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. సోమవారం కోర్టు సమావేశకార్యాలయంలో ఈనెల 15వ తేదీ నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్‌పై కోర్టు న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదుల వద్ద ఉన్న సివిల్, మ్యాట్రిమోనియల్, మోటార్ యాక్సిడెంట్, చెక్‌బౌన్స్ ఇతర రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కారం చేసుకోవాలన్నారు. పెండింగ్ ఉన్న కేసులలో ఉన్న కక్షిదారులు ప్రత్యేక లోక్ అదాలత్‌ను ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జెడ్జి సి.విక్రమ్, జూనియర్ సివిల్ జెడ్జి జి.శశి, కె.సందీప్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దండబోయిన హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి టౌన్: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జించే ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకురావాలని డివిజన్ సహాయ సంచాలకుడు అజ్మీర పర్శురాంనాయక్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదికలో పామాయిల్ పంటల పెంపకం పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రతీ రైతు ఈ పంటకు మొగ్గు చూపాలని సూచించారు. సమావేశంలో హార్టికల్చర్ అధికారి సందీప్, ఏవో కరుణాకర్, సహకార శాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, పీఎస్‌సీ చైర్మన్ గోనె మైసులు, వరుణ్, రైతులు పాల్గొన్నారు.
జనగామ: రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల లయన్స్ క్లబ్ కూటమి 320 మల్టిపుల్ కౌన్సిల్ పీఆర్‌ఓ (పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్)గా పూర్వ జిల్లా గవర్నర్ కన్నా పర్శరాములు సోమవారం నియమితులయ్యారు. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ రాజేంద్రప్రసాద్ మెయిల్ ద్వారా నియామక పత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా పర్షరాములు మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఎదుగుదలకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టినన్నారు. పలు పదవులను అలంకరిస్తూ పీఆర్‌ఓగా ఎన్నికయ్యేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
బచ్చన్నపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అందుకుగానూ గ్రామాలలో వైద్య సిబ్బంది చేత అవగాహన కలిగించాలని డీఎంహెచ్‌ఓ కె.మల్లికార్జున్‌రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మండల వైద్యాధికారి సృజన, వైద్యులు పాల్గొన్నారు.
ప్రమాదం..పొంచి ఉంది!
జనగామ: మండలంలోని చీటకోడూరు గ్రామ శివారులోని ప్రధాన రహదారి వాగుపై నిర్మించిన కల్వర్టు భారీ వరదల కారణంగా సీసీ విరిగిపోయి కొట్టుకుపోతోంది. వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో కల్వర్టు సిమెంట్ స్లాబులు విరిగిపడి రోడ్డంతా పగుళ్లతో నిండిపోయింది. ఇప్పటికీ అదే దారిలో చీటకోడూరు, చౌడారం, మరో ఆరు గ్రామాల ప్రజలు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు నిత్యం వాహనాలు, ద్విచక్రవాహనాలపై ప్రాణాలను పణంగా పెట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించలేదు. వాగుపై కొత్త కల్వర్టు నిర్మాణం అత్యవసరమని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాగులో నీరు ప్రవహిస్తుండటంతో ప్రమాదం మరింత తీవ్రంగా ఉంది. అత్యవసరంగా తాత్కాలిక మార్గం కల్పించకపోతే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలు తక్షణమే స్పందించి ఽకల్వర్టును మరమ్మతు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
							రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం
							రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం
							రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
