
వరద పారదు..చెరువు నిండదు
● జిల్లాలో 16.6 మిల్లీమీటర్ల వర్షపాతం
జనగామ: తుఫాను ప్రభావం అనేక జిల్లాల్లో కుంభవృష్టి కురిపిస్తుంటే... జిల్లాలో ముసురుతోనే పెడతున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించినా.. కాగితానికే పరిమితంగా మారిపోయింది. ఎండుతున్న పంటలకు ముసురు ఊపిరి పోస్తున్నా... చిరు జల్లులతో భూగర్భ జలాలు పెరిగే అవకాశం లేకుండా పోయింది. నాలుగురోజులుగా ఊరిస్తూ... మురిపిస్తూ కురుస్తున్న వర్షంతో వరద పారదు, చెరువు నిండని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్‌లో అనేక ప్రాంతాల్లో చెరువులు జలకళతో నిండుకుండలా మారగా.. జిల్లాలోని చెరువు మోడు బారి కనిపిస్తున్నాయి. కాగా జిల్లాలో శుక్రవారం అత్యధికంగా నర్మెట మండలంలో 30, అత్యల్పంగా కొడకండ్ల మండలంలో 12.5 మిల్లీ మీ టర్లు (మొత్తం 16.6) వర్షపాతం కురిసింది.