నమ్మకం సడలుతోంది..!
కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు తగ్గుతున్న వినతులు
రూ.5 భోజనం ప్రారంభించాలి
జనగామ వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు మేలు చేసే విధంగా రూ.5 భోజనం ప్రారంభించాలి. విశ్రాంతి గదిని మరింత విశాలంగా మార్చాలి. మార్కెట్‌కు సరుకులను తీసుకువచ్చే క్రమంలో మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ధర పడిపోకుండా జాగ్రత్త వహించాలి. – కన్నారపు పరుశరాములు
అసైన్డ్ భూమి నుంచి కాల్వ తీయాలి
మా అమ్మ శెట్టి సుజాత పేరున 343ఏ, 354ఏ సర్వే నంబర్లలో 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దేవాదుల కాల్వ నిర్మాణానికి అధికారులు తమ మూడెకరాల భూమి నుంచి సర్వే చేశారు. పక్కనే ఉన్న అసైన్డ్ భూమి నుంచి కాల్వ తీయాలని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదు. మాకు వేరే ఆధారం లేదు. భూమిని కాపాడాలి. – శిరంశెట్టి మహేందర్, మల్లంపల్లి(పాలకుర్తి)
ఒకరి స్థలం.. మరొకరికి రిజిస్ట్రేషన్
గ్రామంలో తన పేరిట 157 గజాల ఇంటి స్థలం ఉంది. గత ఏడాది డిసెంబర్ 18 వరకు ఇంటి పన్ను చెల్లించాను. ఇదే సమయంలో తమకు తెలియకుండా స్థలాన్ని గ్రామ అధికారి మరొకరి పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఇంటి స్థలాన్ని తమకు కాకుండా చేశారు. న్యాయం చేయాలని అర్జీ పెట్టుకోగా.. విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
– గుండని సుజాత, లింగంపల్లి(బచ్చన్నపేట)
నమ్మకం సడలుతోంది..!
నమ్మకం సడలుతోంది..!
నమ్మకం సడలుతోంది..!


