ఆదరించండి.. అభివృద్ధి చేస్తా | Sakshi
Sakshi News home page

ఆదరించండి.. అభివృద్ధి చేస్తా

Published Sat, Nov 18 2023 1:46 AM

కొన్నెలో ఓటర్లకు దండం పెడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి - Sakshi

జనగామ/బచ్చన్నపేట: శాసనసభ ఎన్నికల్లో స్థానికుడినైన తనను ఆదరించండి.. అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్‌ జనగామ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బచ్చన్నపేట మండలంలోని రామచంద్రాపురం, కొన్నె, దబ్బగుంటపల్లి, లింగంపల్లి, మన్‌సాన్‌పల్లి, సాల్వాపూర్‌ గ్రామాల్లో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ఆప్యాయంగా పలకరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం కొమ్మూ రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలోనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పారు. రిజర్వాయర్లను నిర్మించి దేవాదుల కెనాల్‌ ద్వారా జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ సర్కారు అన్నదా తలకు ఇంత వరకు పంట రుణమాఫీ చేయలేదని, కాంగ్రెస్‌ మొదటి సంతకం రెండు లక్షల రుణ మాఫీపై పెడుతుందని అన్నారు. ఈ ప్రాంత సమస్యలు తెలియని నాయకులు ఓట్ల కోసం వస్తున్నారని, వారిని నమ్మి మోసపోవద్దని కోరారు.

పార్టీలో చేరిన పలువురు

బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం ఉప సర్పంచ్‌ స్వాతి, చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన 300 మంది, పలు గ్రామాల్లో వివిధ పార్టీల కు చెందిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కొమ్మూరి కండువా కప్పి సాదరంగా ఆహ్వా నించారు. నాయకులు జంగిటి విద్యానాథ్‌, చంద్రమౌళి, మల్లారెడ్డి, మల్లేశం, ఆంజనేయులు, ఇస్తారి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కనుకయ్య, బాలకిషన్‌గౌడ్‌, నర్సింహులు, కనకస్వామి, ఆనందం, భాగ్యలక్ష్మి, కిష్టయ్య, వెంకటేషం, హరిబాబు, సత్యనారా యణ, యాదగిరి నర్సింహారెడ్డి, కవిత, నరేష్‌, బాలకిష్టయ్య, కొమ్ము రవి పాల్గొన్నారు.

గడప గడపకు ప్రచారం

కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. జనగామ పట్టణ పరిధి 24వ వార్డులో నాయకులు శుక్రవారం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. పాత బీటు బజార్‌ హమాలీ కార్మికుల వద్దకు వెళ్లి కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను వివరించారు. కురుమవాడ, శివాలయం, నాగులకుంట్ల, నెహ్రూపార్క్‌, అండర్‌ బ్రిడ్జి ఏరియాల్లో ప్రచారం చేపట్టారు. జనగామ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడ ర్‌ గంగరబోయిన మల్లేశం, ఎర్రమల్ల సుధాకర్‌, మేడ శ్రీనివాస్‌, చెంచారపు బుచ్చిరెడ్డి, వంగాల కల్యాణిమల్లారెడ్డి, జాయ మల్లేశం, బూడిద చిన్నా గౌడ్‌, నోముల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలి..

చేర్యాల(సిద్దిపేట): చేర్యాల ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్‌ ఇక్కడికి రావాలి.. ఉద్యమానికి మద్దతిచ్చిన ఈ ప్రాంతానికి ఎంచేశారో చెప్పాలని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి సిద్దిపేట, గజ్వేల్‌ కంటే ఎక్కువ మద్దతు ఇచ్చిన చేర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఉద్యమకారులను పక్కనబెట్టి ఉద్య మ ద్రోహులకు పదవులిచ్చారని విమర్శించారు. ఏడేళ్లుగా చేర్యాల రెవెన్యూ డివిజన్‌ ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోలేదని అన్నారు. మల్లన్న సాగర్‌ నీళ్లు తపాసుపల్లికి వస్తున్నాయని అబద్ధపు మాటలు చెప్పిన సీఎం కేసీఆర్‌.. ఎక్కడ వస్తున్నా యో చూపించాలని డిమాండ్‌ చేశారు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్‌ గిరి కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు లింగం, సురేష్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ కొమ్ము రవి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం

కొమురవెల్లి(సిద్దిపేట): కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి గెలు పు కోసం మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు వివ రించారు. యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌, కొయ్యడ శ్రీనివాస్‌, కనకరాజు, పోతుగంటి రవి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ జనగామ అభ్యర్థి ‘కొమ్మూరి’

బచ్చన్నపేట, జిల్లా కేంద్రంలో

ప్రతాప్‌రెడ్డి ఇంటింటి ప్రచారం

రామచంద్రాపురంలో ప్రజలతో మాట్లాడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
1/3

రామచంద్రాపురంలో ప్రజలతో మాట్లాడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

చేర్యాలలో మాట్లాడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి
2/3

చేర్యాలలో మాట్లాడుతున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

పార్టీలో చేరిన నాయకులతో కొమ్మూరి
3/3

పార్టీలో చేరిన నాయకులతో కొమ్మూరి

Advertisement
 
Advertisement
 
Advertisement