జగిత్యాల: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. జిల్లాకేంద్రం శివారులోని డబుల్‌బెడ్‌రూం కాలనీని గురువారం సందర్శించారు. దరఖాస్తు చేసుకుంటే అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కాలనీవాసులను సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కొంతమంది గృహ ప్రవేశం చేసుకోగా ఆయన పాల్గొన్నారు. వెంట కమిషనర్ సత్యప్రణవ్ పాల్గొన్నారు. శంకులపల్లికి చెందిన మామిడి లక్ష్మీ మోకీళ్ల సమస్యతో బాధపడుతుండగా రూ.75వేల విలువైన ఎల్‌వోసీ అందించారు. ఆయ న వెంట నాయకులు శ్రీనివాస్, రాజు ఉన్నారు.
గ్రామాలను అభివృద్ధి చేస్తాం
రాయికల్: గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని మైతాపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. రూ.10లక్షలతో మహిళా సమాఖ్య భవనం, రూ.8 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. గ్రామాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం మైతాపూర్, అల్లీపూర్, కిష్టంపేటలో ఇందిరమ్మ గృహ ప్రవేశాల్లో పాల్గొన్నారు. రూ.1.56 కోట్లతో కిష్టంపేట నుంచి చల్‌గల్ వరకు నిర్మిస్తున్న బీటీరోడ్డు పనులను పరిశీలించారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, సర్పంచులు తలారి నాగమణి, అంజన్న, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, డీఈ మిలింద్, ఏఈ ప్రసాద్, మాజీ జెడ్పీటీసీ గోపి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రావు పాల్గొన్నారు.
గృహ ప్రవేశాల్లో ఎమ్మెల్యే
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో సంకోజి దివ్యారాణి, కిరణ్, గంగాధరి లక్ష్మీ, గంగరాజం నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లలో ఎమ్మెల్యే గృహప్రవేశం చేశారు. సర్పంచ్ కట్ట రాజేందర మాజీ సర్పంచ్ గంగారాం, మాజీ ఎంపీటీసీ కర్నె భూమరెడ్డి, సదానందం, వెంకటేశ్, మేశ్, భీమేశ్, లింగారెడ్డి, గంగారావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


