ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలు

Jul 10 2026 5:28 AM | Updated on Jul 10 2026 5:28 AM

● రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌.లోకేశ్‌కుమార్‌

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లా కేంద్రంలోని ఎరువులు, విత్తన దుకాణాలను టాస్క్‌ఫోర్సు బృందం సభ్యులు గురువారం తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్లు, ఈ–పాస్‌ మిషన్లను పరిశీలించారు. ఫర్టిలైజర్‌ యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ తీరును పరిశీలించారు. యూరియాను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ఎరువును వ్యవసాయేతర అవసరాలకు విక్రయించొద్దని సూచించారు. టెక్నికల్‌ ఏడీఏ రాజుల నాయుడు, టౌన్‌ సీఐ కరుణాకర్‌, ఏడీఏ తిరుపతి నాయక్‌, ఏవో వినీల పాల్గొన్నారు.

జగిత్యాల నుంచి కూకట్‌పల్లికి సూపర్‌ లగ్జరీ బస్‌

జగిత్యాలటౌన్‌: జగిత్యాల నుంచి కూకట్‌పల్లి వరకు సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసును డిపో మేనేజర్‌ రమేశ్‌ తన సిబ్బందితో కలిసి గురువారం ప్రారంభించారు. ప్రయాణికుల అసరాలను దృష్టిలో ఉంచుకుని కూకట్‌పల్లికి రెండు సూపర్‌ లగ్జరీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని, ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. వేకువజామున మూడు గంటలకు మొదటి ట్రిప్పు మధ్యాహ్నం మూడు గంటలకు రెండో ట్రిప్‌ ఉంటుందని, తిరిగి ఉదయం 9గంటలకు, రాత్రి 9గంటలకు కూకట్‌పల్లి నుంచి జగిత్యాలకు రెండు ట్రిప్పులు నడుస్తాయని తెలిపారు. డిపో సీఐ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.

జడ్జిని కలిసిన ఎన్‌పీడీసీఎల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌

జగిత్యాలజోన్‌: ఎన్‌పీడీసీఎల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా ఎంపికై న సీనియర్‌ న్యాయవాది మెట్ట మహేందర్‌ గురువారం బాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. విద్యుత్‌ శాఖ కేసులను సత్వరమే పరిష్కరించేలా చొరవ చూపాలని ఆయనకు జిల్లా జడ్జి సూచించారు. ఆయన వెంట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ప్రధాన కార్యదర్శి మెట్ట మహేందర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.

భూముల రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి

జగిత్యాల: భూముల రీసర్వేను పకడ్బందీగా చేపట్టాలని.. మొదటి దశలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీసర్వే చేపడతామని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌.లోకేశ్‌కుమార్‌ అన్నారు. గురువారం కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సర్వేతో ప్రతి సర్వేనంబరుకు స్పష్టమైన యాజమాన్య హక్కులు నిర్ధారించడంతోపాటు, భూమికి భూధార్‌ నంబరు కేటాయించనున్నట్లు తెలిపారు. డీజీపీఎస్‌ రోవర్స్‌, జీఐఎస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వే కొనసాగుతుందన్నారు. దీనిపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, రీసర్వే పూర్తయ్యేంత వరకు రెగ్యులర్‌ సర్వేయర్లను 25 మందిని రొటేషన్‌ పద్ధతిలో నియమించాలని పేర్కొన్నారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మాట్లాడుతూ.. రెండు నెలలుగా భూభారతి వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు, బఫరింగ్‌ సమస్యలు ఎదురవుతున్నాయని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం కష్టంగా మారుతోందని తెలిపారు. ఎంపికై న గ్రామాల్లోని ఐదు గ్రామాల్లో రీసర్వే చేశామని, ప్రతిరోజు రెండు గ్రామాల చొప్పున చేపడుతున్నామని వివరించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ లత, ఏడీ కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement