జగిత్యాల: వీబీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాల్లో శాశ్వత ఆస్తులు నిర్మించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లో పథకంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. 2005లో గ్రామీణ ప్రాంతాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటి కేంద్రప్రభుత్వం మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనిద్వారా ప్రజల జీవన ప్రమాణాలు, విద్యాస్థాయి మెరుగుపడిందన్నారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సహజ వనరులు, ఆదాయ మార్గాలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ వేరు చేసే విధానాలపై అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, లత, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, డీఆర్డీవో రఘువరణ్ పాల్గొన్నారు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
ఫౌండేషన్ లిటరసీ అన్ న్యూమరసీపై దృష్టి సారించాలని కలెక్టర్ అన్నారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ప్రతి విద్యార్థిలో చదవడం, రాయడం కనీస సామర్థ్యాలు పెంపొందించేలా చూడాలన్నారు. పదో తరగతి విద్యార్థులు కొందరు ఇప్పటికీ అభ్యాసన సామర్థ్యాలు సాధించలేకపోతున్నారన్నారు. డీఈవో రాము, ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.


