కరీంనగర్‌స్పోర్ట్స్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన యోగా క్రీడాకారిణి జాపతి ఆమని యోగాను జీవిత విధానంగా మార్చుకుని జాతీయస్థాయికి ఎదిగింది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వసతులు, శిక్షణ దొరకడం కష్టమైనప్పటికీ, పట్టుదల, కఠిన సాధనతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన యోగా పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి కేరళలో జరిగిన జాతీయస్థాయి సీనియర్స్‌లో సత్తా చాటి 5వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయస్థాయితో పాటు నేపాల్‌లో జరిగిన పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది.


