జగిత్యాలటౌన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు మల్యాల రాకేశ్ అన్నారు. కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్‌లోని డీఈవో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారి మధ్య తోపులాట జరిగింది. పాఠశాలల్లో వసతులు కల్పించకుండా పరోక్షంగా ప్రైవేట్ బలోపేతానికి సహకరిస్తోందని ఆరోపించారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


