‘ఎస్‌ఐఆర్‌’ పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘ఎస్‌ఐఆర్‌’ పారదర్శకంగా నిర్వహించాలి

Jun 19 2026 1:24 AM | Updated on Jun 19 2026 1:24 AM

మల్లాపూర్‌ : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. మండలకేంద్రంలోని కేఎంఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో గురువారం ఎస్‌ఐఆర్‌పై బీఎల్వోలకు శిక్షణ కల్పించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రక్రియను నిష్పక్షపాతకంగా చేపట్టాలన్నారు. ఇంటింటి సర్వేలో ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అర్హులను జాబితాలో నమోదయ్యేలా చూడాలని కోరారు. ఓటర్‌ జాబితాల నాణ్యతను మెరుగుపరచడంలో బీఎల్వోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. కోరుట్ల ఆర్డీవో జీవాకర్‌రెడ్డి, తహసీల్దార్లు రాంచందర్‌, వినోద్‌, ఎంపీడీవో శ్రీకాంత్‌, ఆర్‌ఐలు అశోక్‌, రమేష్‌, బీఎల్వోలు, వీవీధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

శిక్షణలో సొమ్మసిల్లిన బీఎల్వో

రాజకీయ పార్టీల నాయకులు, కలెక్టర్‌ ఎస్‌ఐఆర్‌పై వివరిస్తుండగా.. మల్లాపూర్‌కు చెందిన బీఎల్వో ఏనుగు రాధ సొమ్మసిల్లి కుర్చీ నుంచి కిందకు పడిపోయింది. తహసీల్దార్‌, ఎంపీడీవో రాధ వద్దకు వెళ్లి సర్పంచ్‌ లక్ష్మణ్‌ కారులో పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు రాధను మెట్‌పల్లి ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి

జగిత్యాల: సహకార శాఖ ఆధ్వర్యంలో తలపెట్టిన 50 వేల టన్నుల గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సహకార అభివృద్ధి మండలితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో రాష్ట్రంలో జిల్లా మూడోస్థానంలో ఉందని, జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ వద్ద గోదాముల నిర్మాణానికి ఇప్పటికే భూమి కేటాయించామన్నారు. మిగతా పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సోలార్‌ పవర్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లత, జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్‌, భాస్కర్‌, సత్యనారాయణరావు, లక్ష్మీకాంతరావు, ఎఫ్‌సీఐ అధికారి నవీన్‌ పాల్గొన్నారు.

మల్లాపూర్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

మల్లాపూర్‌లో ఎస్‌ఐఆర్‌ శిక్షణ కార్యక్రమంలో సోమ్మసిల్లి పడిపోయిన బీఎల్వో రాధ

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement