ధర్మపురి: బడిని బతికించుకునేందుకు ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిన తమ పిల్లలను తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించారు మండలంలోని గాదెపెల్లి గ్రామానికి చెందిన ప్రజలు. సుమారు 30 మంది పిల్లలు వివిధ ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో సర్పంచ్ అల్పట్ల సురేష్ ఆధ్వర్యంలో గురవారం తల్లిదండ్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. దీనికి తల్లిదండ్రులు అంగీకరించి.. తమతమ పిల్లలను తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. సర్పంచ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్కులు పంపిణీ
మండలంలోని కమలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్‌ల పంపిణీ చేశారు. హెచ్‌ఎం ఎదుల మహేశ్ ఆధ్వర్యంలో సర్పంచ్ కుమ్మరి తిరుపతి పుస్తకాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలనే నాణ్యమైన బోధన అందుతుందన్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


